నిరుద్యోగ యువతకు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి చేయూత..
– తిరుపతి వేదికగా మెగా జాబ్ మేళ
– జాబ్ మేళాకు విశేష స్పందన
– 1000 మంది అభ్యర్థులు హాజరు
చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పించి చేయూతను అందించారు. తమిళనాడు రాష్ర్టం హోసూరుకు చెందిన టాటా ఎలక్ర్టానిక్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయం వేదికగా 240 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గురువారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభమైన ఉద్యోగాల ఎంపిక మధ్యాహ్నం 1.30గంటలకు ముగించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి సుమారు 1000మందికి తక్కువ లేకుండా జాబ్ మేళాకు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. టాటా ఎలక్ర్టానిక్స్ కంపెనీ నుంచి వచ్చిన ప్రతినిధులు తమ సంస్థ నియమ నిబందనలకు లోబడి ఇంటర్వూలను నిర్వహించారు. ఈ ఎంపికలో ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ విద్యార్హతలతో పాటు 18 నుంచి 22 ఏళ్ల వయస్సు కలిగిన యువతులకు మాత్రమే అవకాశం కల్పించారు.
ప్రత్యేక కౌంటర్లలో ద్రువపత్రాల పరిశీలన
మెగా జాబ్ మేళాకు వచ్చిన యువతుల నివాస, విద్యార్హతలకు సంబంధించిన ద్రువ పత్రాలను నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జడ్పీసీఈవో దుర్గాప్రసాద్ నేత్రుత్వంలోని సిబ్బంది మెగా జాబ్ మేళాను పర్యవేక్షణ చేయగా కంపెనీ నుంచి వచ్చిన ఏపీ రీజనల్ హెడ్ టీవీఎస్ మహదేవ్ అభ్యర్థులకు ఇంటర్వూలను పూర్తి చేశారు. అలాగే టాటా ఎలక్ర్టానిక్స్ కంపెనీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నోబల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ సంస్థ నుంచి వచ్చిన వి.విశ్వేశ్వరరావు ఎంపికైన అభ్యర్థుల వివరాలు తెలుసుకుని ద్రువీకరణ పత్రాలను అందజేశారు. మెగా జాబ్ మేళాలో ఎంపికైన 279 మందికి ఈనెల 27వ తేదీన విజయవాడలో శిక్షణ నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు శిక్షణ ఇచ్చిన తరువాత నవంబరు 7వ తేదీన టాటా ఎలక్ర్టానిక్స్ కంపెనీలో విధులు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణకై సిద్ధం కావాలని, ఏ కారణం చేత అయినా రాలేకుంటే ముందుగా తెలియ పరచాలని సూచించారు. కాగా వెయ్యి మంది అభ్యర్థులకు నిర్వహించిన ఇంటర్వూలలో ప్రతిభ చూపించిన వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు పర్యవేక్షకులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఎంపిక కాని అభ్యర్థులు నిరాశ చెందక మరోసారి జరిగే జాబ్ మేళాలో పాల్గొని అవకాశం దక్కించుకునేలా సిద్దం కావాలన్నారు. చివరగా జాబ్ మేళాలో ఎంపికైన యువతులకు ఎంపిక ద్రువీకరణ పత్రాలను వైస్ ఎంపీపీ మాదవరెడ్డి, ఎంపీడీఓ వెంకటనారాయణల చేతులు మీదుగా అందించారు. కాగా ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగ అవకాశం దక్కించుకున్న పలువురు యువతులు తమ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.
అడగకుండానే అన్నీ ఇస్తున్నారు
చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ప్రజలకు అడగకుండా అన్నీ ఇస్తున్నాడు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నాడు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే పని లేకుండా అన్నీ గుమ్మం వద్దకే తెచ్చిచ్చాడు. ఇప్పుడు చదువుకున్న మాకు ఉద్యోగ అవకాశం కూడా అడగకనే తెచ్చి ఇచ్చాడు. చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది.
జె.పూజిత, ఐతేపల్లి, చంద్రగిరి మండలం
మా కుటుంబానికి అండగా నిలిచారు
ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించి మా కుటుంబానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు. నాకు కూడా ఇంత త్వరగా ఉద్యోగం వస్తుందని ఊహించలేదు. ఎంతో మంది చదువు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగం లేక కంపెనీల వద్దకు తిరుగుతున్న ఈ రోజుల్లో కంపెనీ ప్రతినిధులను మా దగ్గరకు తీసుకువచ్చి ఉద్యోగం వచ్చేలా చేశారు.
కె.మౌనీషా, చిన్నగొట్టిగల్లు మండలం
చదువుతో పాటు ఉద్యోగం వచ్చింద
డిగ్రీ చదువు పూర్తవగానే ఎక్కడా ప్రయత్నించకుండా ఉద్యోగం రావడంతో చదువుతో పాటే ఉద్యోగం వచ్చినంత ఆనందం కలుగుతోంది. చాలా మంది డిగ్రీలు చేతబట్టుకుని పెద్ద కంపెనీల్లో ఎక్కడా ఉద్యోగం రానందున చిన్న, చిన్న ప్రయివేటు సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీపీ మోహిత్ రెడ్డిల దయతో టాటా ఎలక్ర్టానిక్స్ వంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
ఎస్. రిజ్వాన, పెరుమాళ్లపల్లి, తిరుపతి రూరల్ మండలం
దీపావళి కానుకగా భావిస్తున్నా
చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగం రావడం చాలా కష్టం. అలాంటిది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ, కంపెనీ ప్రతినిధులు చూపించిన దయతో నాకు ఉద్యోగం వచ్చింది. జాబ్ మేళాలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ కంపెనీ ప్రతినిధులను తమ వద్దకు తెచ్చిన ఘనత మాత్రం ఎమ్మెల్యే చెవిరెడ్డికి దక్కుతుంది. నాకు వచ్చిన ఉద్యోగం దీపావళి కానుకగా ఎమ్మెల్యే ఇచ్చారని భావిస్తున్నా.
టి.ధరణి, చిట్టత్తూరు, ఆర్సీపురం మండలం
ఉద్యోగం రావడం సంతోషంగా ఉంద
అమ్మ, నాన్నలు కష్టపడి చదివించారు.. వారికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా చదువుకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇప్పుడు చదువు పూర్తి కాగానే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించారు. టాటా వంటి బహుళ జాతీ కంపెనీలో ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది.
ఎస్.రాధిక, గుట్టకింద హరిజనవాడ, ఎర్రావారిపాళెం మండలం.
కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు
మా కుటుంబానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారు. టాటా కంపెనీ వంటి పెద్ద సంస్థలో నాకు ఉద్యోగం వస్తుందని ఊహించలేదు. అమ్మ, నాన్నలకు ఆర్థికంగా సహాయం చేసేందుకు గొప్ప అవకాశం కల్పించారు. టాటా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే బందువుల్లో కూడా గౌరవం కలుగుతుంది. చాలా ఆనందంగా ఉద్యోగం చేసి ఆర్థికంగా నా కుటుంబానికి అండగా నిలుస్తాను.