శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయ పునఃనిర్మాణ సమితికి మద్దతుగా రాష్ట్ర పద్మశాలి సంఘం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలోగల అతి పురాతన శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయం పునఃనిర్మాణం కొరకు శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయం పునఃనిర్మాణ సమితి 08-10-2022 తేదీ శనివారం భూమిపూజ చేసింది అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు 20-10-2022 వ తేదీన గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయం పునఃనిర్మాణ సమితికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాస్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయాన్ని సందర్శించారు.
ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాస్ మాట్లాడుతూ 15వ శతాబ్దంలో దేదీప్యమానంగా విరాసిల్లిన, అతి పురాతన శ్రీ తిమ్మప్ప దేవాలయం పరాయి పాలకుల చేతుల్లో శిథిలమై రూపురేఖలు కనుమరుగవుతున్న తరునంలో, శ్రీ తిమ్మప్ప దేవాలయాన్ని తపసి మురళి రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ సమితి భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్ర యావత్ పద్మశాలి సంఘం తరపున తమ వంతు దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని, పద్మశాలీలకంటూ చెందిన పురాతనమైనదంటూ ఏదైనా ఉందంటే అది ఈ తిమ్మప్ప దేవాలయమేనని దీనిని ఇప్పటినుండి పరిరక్షించే బాధ్యతలో మేము పాలుపంచుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మునగపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిల్లుగోటి అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శి సింగిరి లక్ష్మీనారాయణ, ఉప కార్యదర్శి చెన్నా రంగనాయకులు, మరియు తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ సహాయకులు ఓంకార్, తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ సమితి వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, సెక్రెటరీ వెంకటేష్ యాదవ్ జాయింట్ సెక్రెటరీ దారాల వెంకటరమణ, రమేష్ యాదవ్, సోమశేఖర్ యాదవ్, శీను యాదవ్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.