అటవీ భూమి ఆక్రమణ
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్20, మహానంది:
అడవులను రక్షించకపోవడం తో ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అడవులను రక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు అందిస్తుంది. అయితే అడవులరక్షణ కోసం పనిచేయాలసిన ప్రజాప్రతినిధులు వారి స్వలాభంకోసం అడవులను అంతరించేలా చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం గిరిజనులకు భుహక్కు చట్టం అమలు చేయడం జరిగింది. ఇదే అదునుగా భావించిన కొందరు రాజకీయ నాయకులు గ్రామాలలో నివాసం ఉంటున్న గిరిజనులను తీసుకెళ్లి కృష్ణనంది సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ సమీపంలో నివసించేలా ఏర్పాట్లు చేశారు. అడవిశాఖ అధికారులు అడ్డుచెప్పినా రాజకీయం తొడుకావడంతో కిందిస్థాయి అడవిశాఖ అధికారులు అడ్డుకోలేఖపోయారు. అయితే ప్రస్తుతం గిరిజనులకు అడవిశాఖ 40 ఎకరాలు సాగుచేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కానీ గిరిజనులు మాత్రం 60 ఎకరాల భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన అడవిశాఖ అధికారులను సైతం లెక్కచేయకుండా తమపని కానిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు అధికారుల అనుమతులు లేకుండా అదనంగా సాగుకు సిద్ధం చేస్తున్న అడవి భూమిని కాపాడాలని వృక్షజాతి ప్రేమికులు కోరుతున్నారు.