గద్వాల్ : పొలం పనుల కోసం ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తే రైతుకి చీకట్లో పాములు, తేళ్లు కుట్టడం, కరెంట్ షాక్, నీట మునగడం, అగ్ని ప్రమాదాలు, ఆక్సిడెంట్లు వంటి కారణాలతో మరణం సంభవించడం, కాళ్లు చేతులు పొగొట్టుకోవడం, లేదా గాయాలపాలై హాస్పిటల్ పాలవ్వడం జరిగిన సంధర్బంలో వారి కుటుంబానికి ఆసరా ఉండేలాగ సంవత్సరానికి ఒకసారి పోస్ట్ ఆఫీసులో కేవలం రూ.399కట్టుకుంటే 10లక్షల ప్రమాద భీమా లభిస్తుందని, రైతులు, భూమిలేని కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, 18సంవత్సరాలు నిండిన విద్యార్థులు, యువకులు, 65 సంవత్సరాల వృద్దులు వారు ప్రతిఒక్కరు పోస్టాఫీసు వారిని సంప్రదించి ఇన్సూరెన్సు పాలసీ చేసుకోవచ్చని ఇన్సూరెన్స్ పైనా అవగాహన కల్పించడానికి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని తపాలా ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం కలిగించే తపాలా ప్రమాద భీమాను గ్రామ స్థాయిలోను, మరియు పట్టణ, మండల స్థాయిలోనూ నమోదు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. 18 నుండి 65 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తించే ఈ పథకంపై ప్రచారం చేపట్టి, భీమాలు నమోదు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో జోగులాంబ గద్వాల్ జిల్లా ASP శ్రీ అజయ్ సింగ్ చౌహన్ గారితో తపాలా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల మహబూబ్ నగర్ పోస్టల్ సుపరీడెంటెంట్ శ్రీ షేక్ సెబ్బీర్ గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిపించాలని తపాలా ఉద్యోగులతో పాటు అన్ని రకాల మీడియా వర్గాలవారిని కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కోరడం జరిగింది….