స్టూడియో 10టీవీ, అక్టోబర్ మంత్రాలయం న్యూస్:-నాడు-నేడు కార్యక్రమంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు /మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా…… మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వైఎస్సార్సీపీ నేత వై. సీతారామిరెడ్డి తో కలిసి రూ 2.10 కోట్లతో 18 అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు.