అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లి పంచాయతీ, శాంతినగర్ లో, అంగన్వాడీ టీచర్ రాధా, భర్త మాజీ సర్పంచి దివిటి మోహన్ ని, శనివారం మధ్యాహ్నం పట్టపగలు ఇంట్లో వరండాలో కూర్చొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తితో పొడవడం తో ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా మృతి చెందారు. ఈ ఘటన రైల్వే కోడూరులో దిగ్భ్రాంతి కలిగిస్తుందని, ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదని, ఇటువంటి దారుణానికి పాల్పడిన దోషులని ఎవరైనాఎంతటి వారైనా, అరెస్టు చేసి శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన లు పునరావృతం కాకుండా చూడాలన్నారు . సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.