స్టూడియో 10టీవీ న్యూస్ కోసిగి అక్టోబర్ 15:- పల్లెపాడు రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం చింతకుంట రోడ్డులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ రాముడు సీఐటీయూ మండల ప్రెసిడెంట్ మల్లికార్జున రైతు సంఘం మండల కన్వీనర్ వీరేష్ ఆటో యూనియన్ మండల నాయకులు వెంకటేష్ లు మాట్లాడుతూ కోసిగి మండలంలో గత ప్రభుత్వం వేసిన రోడ్లే నేటికీ కొనసాగుతున్నాయని వైయస్సార్సీపి ప్రభుత్వం రోడ్లు మరమ్మతు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని వారు విమర్శించారు. కోసిగి పల్లిపాడు రోడ్డు గుంతలు ఏర్పడి పూర్తిగా అద్వానంగాతయారైందని వారు అన్నారు. గుంతలు ఏర్పడిన రోడ్లో వర్షపు నీరు చేరడంతో ఏదిరోడో ఏది గుంతలు వాహనదారులకు తెలియని పరిస్థితి నెలకొని ఉందని దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. పల్లెపాడు చింతకుంట గ్రామాల గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం దవాఖానకు వెళ్లాలంటే ఆటోలు గానీ అంబులెన్సులు గాని రావడంలేదని ఆయా గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు అన్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కోసి చింతకుంట పల్లెపాడు రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ముకురన్న వీరారెడ్డి దేవమణి తిక్కయ్య ఆనంద్ మారయ్య నాగలింగ నరసింహులు సురేష్ వెంకటేశులు డివైఎఫ్ఐ నాయకులు రాజు నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది.