స్టూడియో 10టీవి న్యూస్, కోసిగి అక్టోబర్15 :- కోసిగి మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైతులు వేసిన పత్తి ఉల్లి మిరప పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోయారని వెంటనే పరిహార అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కన్వీనర్ వీరేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతుల వేసిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి ఉల్లి మిరప పంటలు అధికంగా సాగు చేశారని ఈ పంటలు సాగుకు ఎకరాకు 50 వేల రూపాయల నుండి 80 వేల వరకు వరకు పెట్టుబడి పెట్టినారని అధిక వర్షాలకు కుళ్ళు తెగులు వచ్చి పంట పూర్తిగా దెబ్బ తినడంతో రైతులకు పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కావున ప్రభుత్వం అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం రైతులకు అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఈరమ్మ ఈరన్న రైతు సంఘం నాయకులు నర్సింలు రాజు రాముడు తిక్కప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.