గద్వాల్: శనివారం గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని గేట్ ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అందవలసిన బకాయిలు అనగా 2017 మరియు 2021 కి సంబంధించిన పి.ఆర్.సి మరియు ఐదు డిఏలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో ఘోర విఫలం జరిగినదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వము పెంచే జీతాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులకు పెంచిన ఒక్క ఆర్టీసీ ఉద్యోగులకు పెంచకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఆర్టీసీ మీద మరియు ఉద్యోగుల మీద పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ముందుండి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కనీసం జీతాల పెంపుకు కూడా నోచుకోకపోవడం దురదృష్టకరమని, బంగారు తెలంగాణలో కష్టపడే కార్మికుడిని మరింత కష్టపెట్టే ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికులు డిమాండ్ డేను పాటిస్తూ తమకు రావలసిన రెండు పీఆర్సీలు ,ఐదు డిఏలు, 2013 పిఆర్సికి సంబంధించిన ఏరియర్స్ బాండ్ల డబ్బులు మరియు రిటైర్మెంట్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని మరియు అధికారుల వేధింపులను నిరసిస్తూ,పెరిగిన కిలోమీటర్లను తగ్గించాలని, కార్మిక చట్టాలకు అనుగుణంగా పనిగంటలను నిర్ణయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఈవిఆర్ గౌడ్, గిరి రాజు, కృష్ణ, గోవిందరాజులు, రాములు, డీవీబీ రెడ్డి, తిప్పన్న, నరసింహ, జిలాని, వెంకటస్వామి మొదలగు వారు పాల్గొన్నారు