స్టూడియో 10టీవీ కోసిగి న్యూస్:- టీడీపీ నాయకులు నీచ రాజకీయాల చేయడం మాను కోవాలని , కోసిగి మండలం వందగల్లు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ లోకి చేరారునడంలో ఎటువంటి వాస్తవం లేదని ఇది టీడీపీ కార్యకర్తల ఆడిన ఒక డ్రామా అని వందగల్లు వైసీపీ నాయకులు కాల్వ లక్మయ్య , వెంకటరెడ్డి ,నరసిములు , తిమ్మయ్య, కర్రెయ్య, ఆటో ఈరన్న రామయ్య తదితరులు అన్నారు.శని వారం వారు కోసిగి ఎంపిడిఒ కార్యాలయం ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వందగల్లు గ్రామంలో టీడీపీ పార్టీ పూర్తిగా కనుమరుగు అయ్యిందని దీనిని జీర్ణించు కోలేని టీడీపీ నాయకులు ప్రస్తుతం కొత్త డ్రామాకు తెరలేపారని , టీడీపీ లో ఉన్న కార్యకర్తల కే టీడీపీ కండువాలు కప్పి వైసీపీ నుండి టీడీపీ లో చేరారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే వల్ల గ్రామంలో ఏఒక్కరూ కూడా టీడీపీ లోకి చేరే పరిస్థితి లేదని వారు అన్నారు.ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో వందగల్లు గ్రామము ఎంతో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు.కూలిపనులకు వెళ్లే వాళ్ళను పిలిచి టీడీపీ కండువాలు వేయడం సిగ్గుచేటని వారు అన్నారు. టీడీపీ వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భారీ మెజారిటీతో నాల్గవ సారి సైతం గెలుపొంది చరిత్ర సృష్టించ నున్నారని వారు అన్నారు.తిక్కరెడ్డి కిఈ సారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కడన్నారు. వైసీపీ ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత ముందుకు సాగుతామన్నారు. ఇందులో వైసీపీవందగల్లు నాయకులు తిమ్మప్ప ఉరుకుందు అంజినెయ్య,జడలయ్య మరెమ్మగుడి నరసిములు, జేట్ఠప్ప, దేవిరెడ్డి, బసవరాజు, రామయ్య పాల్గొన్నారు.