ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చిర్ల
జొన్నాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…
ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను వివరించేందుకు నేరుగా గడపగడపకూ వస్తున్నామని శాసన సభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రెడ్డి అన్నారు.శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామం సచివాలయం-2 పరిధిలో గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్,ఉపసర్పంచ్ నాండ్ర నాగ మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి(దొరబాబు), గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ గొలుగూరి ఈశ్వర్ రెడ్డి,సొసైటీ అధ్యక్షులు తాడి మెహెర్ ఆదిత్య రెడ్డి,తాడి నాగ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికార యంత్రాంగంతో కలిసి ఘనంగా నిర్వహించి ముందుగా తారకరామ కొలనీలో ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి(దొరబాబు) సారథ్యంలో 50లక్షల రూపాయలతో పూర్తి చేసిన బీసీ కమ్యూనిటీ హాల్, 40 లక్షల రూపాయలతో పూర్తి చేసిన గ్రామ సచివాలయాలను నూతనంగా ప్రారంభించి,గ్రామ పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగానికి వర్షాకాల సమయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటంకోసం గ్రామ నాయకులు సారథ్యంతో ఏర్పాటుచేసిన గొడుగుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.తదనంతరం ప్రతి ఇంటికి చిరునవ్వుతో పలకరిస్తూ గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి చిర్ల వివరిస్తూ ఉండగా గడపగడపకు అక్క,చెల్లెమ్మలు హారతులు ఇస్తూ ఘణస్వాగతం పలకగా ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ.. సంక్షేమం,అభివృద్ధి కల్పించడంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిరంతర ప్రక్రియలుగా నడుస్తూనే ఉంటాయని ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు బాధగా ఉంటుందని కుటుంబాలను ఆయన నేరుగా కలుసుకుని తెలియజేసి వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా సచివాలయం -2 పరిధిలో కలిగిన మొత్తం రూ 10.72 కోట్లు రూపాయలు లబ్ధిని పొంది ఉన్నారని ఆయన తెలియజేసి గ్రామ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు,సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాసు,ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు,రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర రావు,సర్పంచ్ లు గుణ్ణం రాంబాబు, నెక్కింటి వెంకటరాయుడు (బుజ్జి), దొండపాటి చంటి,అన్యం వెంకన్న,దూలం సత్తిబాబు పలువురు వైయస్సార్ నాయకులు తో పాటు ఎంపీడీవో కే.జాన్ లింకన్, తాసిల్దార్ లక్ష్మీపతి,ఆర్ఐ జానకి రాఘవ,బావ నిర్మాణ శాఖ,సచివాలయం సిబ్బంది ఏఎన్ఎమ్,ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు,వాలంటీర్లు , తదితరులు పాల్గొన్నారు.