బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 13,మహానంది:
మహానంది మండల పరిధిలోని నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి గాజులపల్లి మెట్ట వద్ద మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి గురువారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను మరియు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వీరిని కోర్టులో హాజరు పరుస్తామని మహానంది పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.