విఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా మీనిగ బోయ నారాయణ,ప్రధాన కార్యదర్శిగా మదుగోపాల్ నియామకం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 12,మహానంది:
నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పడిన సందర్బంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నంద్యాల జిల్లా కమిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం జరిగిందని. ఎస్టీ పునరుద్దరనే ఏకైక లక్షంగా ఏర్పడిన విఆర్పీఎస్ గత 15 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటాలు చేసి వాల్మీకి జాతికి అండగా నిలిచిందని, ఎస్టీ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సి వస్తుందని అందుకే నూతన జిల్లా నంద్యాలలో కరుడు గట్టిన వాల్మీకి నేతలను సంగం లోనికి రప్పించి ఉద్యమాలు చెయ్యవలిచిన అవసరం ఉన్న దృష్ట్యా మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన మీనిగ నారాయణ (నారి)ని నంద్యాల జిల్లా అధ్యక్షునిగా , ప్రధాన కార్యదర్శిగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మదుగోపాల్ ను విఆర్పీఎస్ ఫౌండర్ సుభాస్ చంద్రబోస్ మరియు విఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా నంద్యాల ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా బోస్ మరియు రాష్ట్ర కమిటీ నేతలు మాట్లాడుతూ నారాయణ కు శుభాకాంక్షలు తెలుపుతూ జాతికి పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యాలని అలా కాకుండా జాతికి సంఘానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే వెంటనే తొలగించే అధికారం రాష్ట్రకమిటికి ఉందని వారు తెలిపారు.