డ్రిప్ ఇరిగేషన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 12,మహానంది:
నీటి ఎద్దడి పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నీటి వనరులతో అవలంబించే వ్యవసాయ పద్ధతులపై వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవల్యూస్ ఇరిగేషన్ సంస్థ అధికారి అబ్దుల్ రెహమాన్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామ సచివాలయం 1 వద్ద డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వలన కలిగే లాభాలు, ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే పరికరాల వివరాలు గురించి రైతులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సంఘం యువజన నాయకుడు నారాయణ, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పిఎన్ఎస్ రాయుడు, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, గ్రామ నాయకుడు బోజ్జయ్య, బి. వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రాము, శ్రీనివాసులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.