జన్ శిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కార్యక్రమం.. పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం జన్ శిక్షన్ సంస్థాన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో పాకాల నందు వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కార్యక్రమం జన్ శిక్షన్ సంస్థాన్ సంస్థ డైరెక్టర్ మోహన్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాకాల జడ్పిటిసి నంగా పద్మజారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, జన్ శిక్షన్ సంస్థాన్ సంస్థ డైరెక్టర్ యం.మోహన్ లు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే చేతివృత్తులు నేర్చుకుని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.ఇక్కడ ఉచితంగా బ్యూటిషన్, టైలరింగ్, కంప్యూటర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జన్ శిక్షన్ సంస్థాన్ సంస్థ ఇచ్చే చేతివృత్తులు నేర్చుకోవాలని చెప్పారు.ప్రతి మహిళ చేతివృత్తులు నేర్చుకుని ఎంతో కొంత డబ్బు పొదుపు చేసుకుని కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ శిక్షన్ సంస్థాన్ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, టీచర్ మంజుల, మహిళలు పాల్గొన్నారు.