మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్09, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో శని,ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆదివారం భక్తుల రద్దీతో కళ కళలాడింది. స్థానికులు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిమంది మహానందికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో నెలకొంది. తెల్లవారుజామున నుండి భక్తులు స్థానిక రుద్ర గుండం, చిన్న కోనేరులో పుణ్య స్థానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మహానంది దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.