స్టూడియో 10 టీవీ అక్టోబర్ 09
వాల్మీకి మహర్షి గుడికి భూమి పూజ
గిద్దలూరు పట్టణంలోని వార్డు అయిన కొండపేట గ్రామంలోని వాల్మీకి సంఘం సభ్యులు అందరూ కలిసి కట్టుగా వాల్మీకి మహర్షి ఆశ్వియుజ పౌర్ణమి రోజు పుట్టినరోజు కావడంతో ఈ ఆదివారం రోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు వాల్మీకి సంఘం పిలుపుమేరకు వాల్మీకి మహర్షి గుడికి టెంకాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వాల్మీకి కుటుంబాలు ఉన్న ప్రతి గ్రామంలో వాల్మీకి మహర్షి గుడి ఉండాలన్నారు. అలాగే ప్రతి ఇంటిలో వాల్మీకి మహర్షి ఫోటో ఉంచుకోవాలన్నారు. మనకు మానవ రూపంలో వాల్మీకి మహర్షి ఉండవచ్చు కానీ శ్రీరామచంద్రుడు కు సమానమని చరిత్ర చెబుతుందన్నారు. ఆయన గురించి ,వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రతి మనిషికి ప్రతి గ్రామంలో తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పలానా వాళ్లకు అని కాకుండా భారత దేశంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందన్నారు. వాల్మీకి మహర్షి గుడికి స్థలంఇచ్చిన స్థలదాత మేకల ప్రసాదును గ్రామస్తులందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు, వాల్మీకి సంఘం అధ్యక్షులు పడకండ్ల శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు మీనిగ రామకృష్ణయ్య ఎక్స్ ఆర్మీ, స్థలదాత మేకల ప్రసాదు, డీలర్ రమణ, మేకల రోశయ్య, మండ్ల రోశయ్య, మండ్ల బుజ్జి, సీలం నరసింహారెడ్డి,గ్రామంలోని వాల్మీకి సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.