స్టూడియో10 టీవీ అక్టోబర్ 09
విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలిక హితోపదేశాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డులోని స్ధానిక మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో షేక్ ఖాజా హుస్సేన్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరిపారు. ముఖ్యఅతిథిగా మోతుకూరి నెమలి గుండం చేతుల మీదుగా వికలాంగుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాలు ,పండ్లు, బ్రెడ్లు పంచారు.
అనంతరం మాజీ సైనికులు మరియు ప్రస్తుత యూనియన్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ
మహమ్మద్ ప్రవక్త జన్మించిన సందర్భం గా ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్- నబీపండుగను జరుపుకుంటారని 570లో రబీ-ఉల్-అవ్వాల్ పన్నెండో రోజు ప్రవక్త మక్కాలో జన్మించాడు
విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో పొందుపరిచారు. మరో విశేషమేమిటంటే.. మహమ్మద్ ప్రవక్త ఏమీ చదువుకోలేదట. తను కేవలం అల్లాహ్ తహ లా మహిమ పవిత్ర ఖురాన్ ను దైవవాణి రూపంలో ప్రవక్త అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే ఆ ప్రవక్త ప్రవచనాలు అందరి జీవనశైలికి హితోపదేశాలు అయ్యాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహిమాన్, సయ్యద్. మునాఫ్, హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు