గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో అంబనారాన్నంటిన వాసవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ముండ్లపాడు గ్రామం లోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానం లో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినవి. అమ్మవారిని రోజుకో అలంకరణ లో పూజలు నిర్వహించారు. చివరి రోజు వాసవీ మాతాకీ ఊంజల్ సేవ (ఉయ్యాలా పేరంటం )అత్యంత వైభవం గా నిర్వహించిన ఆలయ కమిటీ. ఆర్య వైశ్యుల ప్రధాన పండుగ అయినప్పటికీ గ్రామ ప్రజలు కుల మత భేదాలు లేకుండా అమ్మవారికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శివాపురం ధనుంజయ గుప్తా అమ్మ వారి సేవకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో అమ్మవారి కృపవలన మరింత ఘనంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, గిద్దలూరు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శివాపురం నాగేంద్ర బాబు, మునగనూరి సుబ్బరంగయ్య, గంగిశెట్టి రామసుబ్బారావు, గొంట్ల రామయ్య,శివాపురం రాజా, శివాపురం సత్యనారాయణ, మహిళా కమిటీ ప్రెసిడెంట్ మునగనూరి భాగ్యసురేఖ, శివపురం వరలక్ష్మి, మునగనూరి వెంకట సుబ్బమ్మ, శివాపురం సుప్రజ, ఈదుల రమాదేవి, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.