ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిధిలోని త్రిపురాంతకం గ్రామ పంచాయితీనందు శ్రీమత్ బాల త్రిపురాసుందరిదేవి త్రిపురాంతకేశ్వర ఆలయమునకు జగన్నన స్వచ్చ సంకల్పంలో బాగంగా. జిల్లా పంచాయతీ అధికారి జి. వి నారాయణ రెడ్డి ఆద్వర్యములో మండల పరిషత్ అధ్యక్షులు కోట్ల సుబ్బారెడ్డి . అధ్యక్షుతన గ్రామ సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి చేతుల మీదుగా రెండు రిక్షాలను ఆలయలా పరిసరాల శుభ్రత కోసం ఇవ్వడం జరిగింది. తదుపరి SWPC లను పూర్తి స్థాయిలో వినియోగం లోనికి తీసుకు రావాలి.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం పరిశీలనలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి .వి.నారాయణ రెడ్డి గారు, SWPC వెరిఫికేషన్ కార్యక్రమం లో భాగంగా త్రిపురాంతకం మండలం, మేడపి గ్రామపంచాయతీ SWPCను సందర్శించారు .ఈ సందర్భంగా … గ్రామంలో సేకరించిన చెత్త SWPC వద్దకు చేర్చి ఉండక పోవటంపై,కార్యదర్శిపై ఆగ్రహించారు. తడి చెత్త నుండి వెర్మీ ఎరువు తయారు చేయుటకు బెడ్ ప్రిపరేషన్ చేసి,వెర్మీ సీడింగ్ చేయాలని ఆదేశించారు.. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించనని తెలిపారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ … గ్రామాన్ని ‘చెత్త రహిత సుందరగ్రామం’గా రూపొందించుకోవాలంటే, ప్రజలందరూ వారి ఇంటి నుంచి వచ్చే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతిరోజు వారి ఇళ్లవద్దకు వచ్చే క్లాప్ మిత్రలకు చెత్తను విభజించి అందించాలని మరోమారు పిలుపునిచ్చారు. పొడిచెత్తను సెగ్రిగేషన్ అనంతరం నాడెప్ తొట్టెలలో మాత్రమే వేయాలని,ఆదర్శ SWPC గా రూపొందించాలని కార్యదర్శి కి సూచించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ అందరూ ఒక టీం గా పనిచేసి గ్రామాభివృద్ధికి పాటు పడాలని పిలుపు ఇచ్చారు. SWPC కేంద్రాన్ని సందర్శించి.. తడి చెత్తను పొడి చెత్తను సెగ్రిగేషన్ చేసి వర్మి ఎరువుని త్వరగా తయారు చేయుటకు ఏర్పాటు చేసుకొనవలెనని ,పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించుటలో అలసత్వం వహించారదని తెలిపారు. అనునిత్యం గ్రామ పరిశుభ్రత కు కష్టపాడుతున్న క్లాప్ మిత్రను దుషాలతో సత్కారించడమైనది.ఈ కార్యక్రమంలో యం పి పి.కోట్ల సుబ్బారెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి M మరియదాసు, మండల విస్తరణ అధికారి, N మురళీమోహన్, వైసీపీ నాయకులు సి. హెచ్. యల్లారెడ్డి రాజుపాలెం వారు,త్రిపురాంతకం సర్పంచ్ గారు, మేడపి సర్పంచ్ గారు.పంచాయితీ కార్యదర్శి, బి. ఏడుకొండలు, Sk మాబు బాషా వెంకీరెడ్డి, బి. వి రామిరెడ్డి,మేడపి సచివాలయ సిబ్బంది, అవగాహనా గ్రామ పెద్దలు ,పంచాయతీ కార్యదర్శి ,సచివాలయం సిబ్బంది, మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.