తిరుపతి సంకల్ప సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు గుండె చికిత్సలు నిర్వహిస్తున్నట్లు సంకల్ప చైర్మెన్ బండ్ల వీరేశ్వర్, మెడికల్ డైరెక్టర్ అనంత్ నాగ్ శుక్రవారం ఓక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ నాగరాజ్ కుమార్ ఆద్వర్యంలో అత్యవసర గుండె వైద్య సేవలు, ఇరవై నాలుగు గంటల అత్యవసర ఆంజియోప్లాస్టీలు జరుగుతున్నాయని, ఇప్పుడు చిన్నపిల్లల గుండె చికిత్సలో అనుభవం గడించిన డాక్టర్ గురజాల వెంకటేష్ సంకల్ప ఆసుపత్రిలో ప్రముఖ కన్సల్టెంట్ గా చేరడంతో గుండె వైద్య విభాగం మరింత బలోపేతం అయ్యిందని, ఆరోగ్యశ్రీ కూడా వర్తింప చేస్తున్నామని తెలిపారు ఇప్పుడు చిన్న పిల్లలో ఉండే గుండె జబ్బులు వాటికి సంబందించిన చికిత్సలు కూడా చేపడుతున్నట్లు వారు తెలిపారు. గత వారం ఒక ఆరు సంవత్సరాల చిన్నారికి గుండె చుట్టూ నీరు చేరి ఉండడం వలన పెరి కార్డియా సింథిసిస్ అనే చికిత్స ధ్వారా నీరు తొలగించడం జరిగిందని, ఒక మహిళకి గుండెలో ఎ.ఎస్.డి అను రంధ్రమునకు డివైస్ క్లోసర్ ద్వారా రంధ్రమును మూసివేయడం జరిగిందన్నారు. ఈ నెల తొమ్మిదిన గుండెకు ఎలక్ట్రికల్ సమస్య, కార్డియాక్ అరిత్మీయ లాంటివి ఉన్నవారికి రేడియో ఫ్రీక్వెన్సీ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంకల్ప చైర్మెన్ బండ్ల వీరేశ్వర్, మెడికల్ డైరెక్టర్ అనంత్ నాగ్ తెలిపారు.