ప్రజా సంకల్ప వేదిక వారి జాతీయస్థాయి సేవా రత్న అవార్డు-2022 అందుకున్నా వెంకటయ్య యాదవ్
గిద్దలూరు పట్టణానికి కి చెందిన ఒబిలిబోయిన వెంకటయ్య యాదవ్ గారి సేవలను గుర్తించిన ప్రజా సంకల్ప వేదిక వారు విశిష్ట సేవా రత్న పురస్కారానికి ఎంపిక చేశారు. గిద్దలూరు వేణుగోపాల్ స్వామి గుడి చైర్మన్ ఓ.వెంకటయ్య యాదవ్ ఈ పురస్కారాన్ని గిద్దలూరులోని విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపం లో జరిగిన వేడుకల్లో సన్మానించారు ప్రజా సంకల్ప వేదిక వ్యవస్థాపకులు శ్రీ మాదిరే రంగసాయి రెడ్డి మాట్లాడుతూ వెంకటయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, నేటికి స్ఫూర్తి దాయకమని అన్నారు. వెంకటయ్య లాంటి వారు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. గిద్దలూరు పట్టణం లోని వివిధ మేధావులు,పెద్దలు వెంకటయ్య యాదవ్ గారిని ప్రశంసించారు. వెంకటయ్య మాట్లాడుతూ తాను సమాజ సేవ చేయటంలో సహకరించిన తల్లిదండ్రులకు ,సభ్యులకు, స్నేహితులకు, విలేకరులకు ఫేసుబుక్ ,వాట్సాప్ మిత్రులకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా వివిధ రంగాలలో ప్రముఖులు, సాహితీవేత్తలు, సమాజ సేవకులు, విద్యావేత్తలు, కళాకారులు ఉన్నారు.