భీమేశ్వరరావు మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అన్నా
రాచర్ల మండల వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా సభ్యులు అన్నా రంజిత్ తండ్రి భీమేశ్వరరావు గారు అనారోగ్యంతో మృతి చెందగా గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గారు సోమవారం ఆరవీటికోట గ్రామానికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.