వన్యప్రాణి రక్షణ వారోత్సవాలు
గిద్దలూరు లోని నల్లమల అటవీ ప్రాంతంలోని దిగువమెట్ట గ్రామంలో వన్యప్రాణి రక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం అటవీ శాఖ అధికారులు విద్యార్థిని విద్యార్థులకు వన్యప్రాణుల రక్షణ పై వాటికి హాని కలిగిస్తే చట్టం వేసే కఠిన శిక్షలను వారికి వివరించారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని డిప్యూటీ రేంజ్ అధికారి వంశీకృష్ణ అన్నారు. 1972వ సంవత్సరంలో అప్పటి ప్రధాన ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకొచ్చారన్నారు.