టిడిపి ఇన్చార్జ్ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం
గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో సోమవారం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ ముతుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని స్థానిక టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు పెరిగిన ధరలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచారు.తదుపరి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు.