తెలుగుదేశం హయాంలోని గ్రామాల అభివృద్ధి : గ్రామ కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల
కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సమావేశానికి గిద్దలూరు ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని చిన్న కంభం గ్రామంలో వంద శాతం సిమెంట్ రోడ్లను వేయటం జరిగిందని త్రాగునీటి సమస్యను పరిష్కరించటం జరిగిందని అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించటం జరిగిందని గ్రామ పంచాయతీ మరియు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సబ్ స్టేషన్ ను నిర్మించటం జరిగిందన్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపేందుకు కేంద్ర నిధులను గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ మూడేళ్ళ కాలంలో గ్రామాల అభివృద్ధి పై ఏ మాత్రం శ్రద్ద వహించక పోగా గ్రామాల అభివృద్ధికి కేంద్రం అందించే నిధులను దారి మల్లించటం సిగ్గుచేటు అన్నారు. ఈ మూడేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని గ్రామంలో ప్రతీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ పార్టీ ఆదేశానుసారం చురుగ్గా పని చేస్తూ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండకడుతూ ప్రజల పక్షాన పోరాడాలన్నారు అదే విధంగా పార్టీ బలోపేతం అయ్యే విధంగా ప్రతీ బూతులో ఓటర్ వెరిఫికేషన్, త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఓటరు కు తెలుగుదేశం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియయచేసి రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అలవాలా ప్రసాద్ మండల అధ్యక్షులు తోట శ్రీను ప్రధాన కార్యదర్శి ఆరెపల్లె మల్లిఖార్జున మిట్టా శరబానంద రెడ్డి ఎస్సి సెల్ నాయకులు గోనా చెన్న కేశవులు సిరివెళ్ల రవి కుమార్ మైనార్టీ నాయకులు షేక్ అత్తర్ దాదా తదితరులు పాల్గొన్నారు.