విద్యార్థి యువతకు భవిత కావాలంటే జగన్ దిగిపోవాలి
తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మరియు గిద్దలూరు టిడిపి ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు తిప్పరమల్లి రవితేజ ఆధ్వర్యంలో ఒంగోలు నందు నిర్వహించినటువంటి విద్య ఆగ్రహ దీక్షకు మద్దతుగా గిద్దలూరు నియోజకవర్గం నుండి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ కమిటీ మరియు గిద్దలూరు నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్ ఆఫీస్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వి.సాయి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరించి పేదలకు ఉచిత విద్యను అందించాలని,అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి విద్యాదివన వసతిదీవెన అమ్మఒడి పూర్తిస్థాయిలో అందించాలని, పాఠశాలల విలీనంకు సంబంధించిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని,ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఈర్నేని లింగయ్య, పార్లమెంట్ కార్యదర్శి పాలుదారి షరీఫ్ బెస్తవారిపేట అధ్యక్షులు మార్తాలా రమణారెడ్డి కంభం మండల అధ్యక్షులు షేక్ గౌస్ బాషా రాచర్ల మండల అధ్యక్షులు పిక్కిలి రమేష్ మరియు పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు….