గాంధీజి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి
మహాత్మగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలంటే గాంధీజీ సిద్దాంతాలే అచరణయమని,అహింసా వాద సిద్దాంతంతో గాంధీజి ప్రపంచంలో అతి శక్తివంతమైన వ్యక్తిగా గుర్తించబడ్డారన్నారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.దేశానికి శాంతియుత మార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. ఆయన స్పూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సున్నపు వసంతం,గుండాల రాములు, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, గంగి యాదయ్య, ఇరమోళ్ల మల్లేష్, గాయసుద్దీన్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు దేవర సమతావెంకట్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మాణిక్యం శ్రీనివాస్, శ్రీనివాస్, కో-అప్షన్ సభ్యులు నారాయణ, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది కేసారం యాదయ్య, ఎం.యాదయ్య తదితరులు ఉన్నారు.