మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ 153 వ జయంతి సందర్భంగా చింతలపేట సమీపంలో లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ….ప్రపంచం శాంతి కి మార్గదర్శిఅని గాంధీ గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారు బడుగు బలహీన అభ్యున్నతి కృషిచేసిన వ్యక్తి అని , గ్రామ పంచాయతీలు బాగు పడినప్పుడు గ్రామ పంచాయతీలు బాగుపడే రోజు దేశం బాగుపడుతుందని గ్రామాలు అభివృద్ధి చెందాలని, స్వచ్ఛభారత్ ఆకాంక్షించారు తెలిపారు.గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కెసిఆర్ గారి తో సాధ్యమవుతుంది. నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్ , జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, కౌన్సిలర్స్ కృష్ణ నాగరాజు, ఆలయ కమిటీ డైరెక్టర్ కమ్మరి రాము, గద్వాల మండలం పార్టీ అధ్యక్షుడు రాముడు, ధరూర్ మండలం యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.