తిరుమలలో గరుత్మంతునిపై మలయప్ప స్వామి అవతారంతో భక్తులకు దర్శనం

*తిరుమలలో గరుత్మంతునిపై మలయప్ప స్వామి అవతారంతో భక్తులకు దర్శనం*

(తిరుమల) తిరుమలగరుత్మంతునిపైలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఇవాళ గరుడసేవ జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో పశుపక్ష్యాదులు వాహనాలుగా మారి సేవలు అందిస్తున్నాయి. మహావిష్ణువు అత్యంత ప్రీతి పాత్రమైన గరుత్మండు స్వామివారిసేవలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతునిపై విహరించే స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడవాహన సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ గరుడోత్సవం నిర్వహించారు తిరుమల మాడవీధులలో గరుత్మంతుడి పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఒక పెద్ద పండుగ లాగా జరిగింది మాడవీధుల్లో నాట్య కళాకారులతో గజరాజుల మధ్య మేల వాయిద్య తాళాలతో రంగ రంగ వైభవంగా గరుత్మంతుని పై మాడవీధుల్లో దర్శనమిచ్చారు . అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విస్తృత ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మందిని తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులతో 3 వేల ట్రిప్పులు నడుపుతోంది. అలిపిరి పాత చెక్ పోస్టు శ్రీవారి మెట్టు వద్ద ద్విచక్రవాహనాలకు పార్కింగ్ పాయింట్ గా నిర్దేశించారు. తిరుమల కొండపై ఏడు ప్రాంతాల్లో టిటిడి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.

తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు సులువుగా ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అన్నప్రసాదాల భవనాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. ఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా అన్నప్రసాదాలు అందించనున్నారు. తిరుమాడ వీధుల్లో 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూల కొరత లేకుండా బఫర్ స్టాక్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. పీఏసీ-4లో మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1111 కు కాల్ చేయాలని టిటిడి సూచించింది

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!