రోడ్డుపై కూలిన భారీ వృక్షం – వాహనాల రాకపోకలకు అంతరాయం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్01, మహానంది:
మహానంది మండల పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారిలో సీతారామాపురం,గోపవరం, గ్రామాల మధ్య భారీ చింత చెట్టు విరిగి పడటంతో తృటిలో ప్రమాదం తప్పింది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి రోడ్డుకి అడ్డంగా చెట్టు పడటం వల్ల వందలాది వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది.వెంటనే అక్కడి స్థానికులు సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిఉన్న చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్దించారు.