దయనీయ స్థితిలో తెలంగాణ ఉద్యమకారుడు కేశపల్లి రాములు
-: అంకై లూసింగ్ స్పండిలోసిస్ వ్యాధితో సతమతం
-: దళిత బందుతో ఆదుకోండి
-: ఎమ్మెల్యే ఆనంద్ ను కోరుతున్న ది లైట్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లల డాక్టర్ ఆనంద్
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి ఎమ్మార్పీఎస్ తరఫున తనకంటూ ముద్ర వేసుకున్న కేశపల్లి రాములు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాడని ది లైట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ టి ఆనంద్ తెలిపారు. వికారాబాద్ మండలం గోదాంగుడ గ్రామానికి చెందిన కేశపల్లి రాములుకు ఒక రకమైన అంకై లుసింగ్ స్పండి లోసిస్ అనే జన్యుపరమైన, వంశపరమైన వ్యాధితో బాధపడుతున్నారని సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు శరీరంలో ఉన్న జయింట్లు బిగుసుకు పోవడం జరుగుతుందని, అప్పుడే జయింట్లు గట్టి పడి నొప్పితో భాద పడటం ఉంటుందన్నారు. సొంత పనులు కూడా చేసుకునేందుకు రాదని, ఇది నయం కానీ ఒక వ్యాధి అని అన్నారు. మందులు వాడితే కంట్రోల్ లో ఉంటుందని,కానీ ఈ మందులు చాలా ఖరీదుతో కూడుకొని ఉంటాయని, ఆ మందులు తెచ్చుకునే స్థోమత లేక నరకం అనుభవిస్తున్నట్లు తెలిపారు. కేశపల్లి రాములుకు భూమి కూడా లేదని, ఆయన దళిత బిడ్డ కావడంతో దళిత బంధు స్కిం ఆయనకు వర్తింప చేసి ఆయనకు బాసటగా నిలవాలని ఎమ్మెల్యే ఆనంద్ ను ది లైట్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లల డాక్టర్ ఆనంద్ కోరారు. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి దళిత బంధు ఇస్తే జీవిత కాలం మొత్తం ఇచ్చినా వారికి రుణ పడి ఉంటారని అన్నారు. ప్రభుత్వాన్ని దీవించి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుంచుకుంటారని తెలిపారు.