మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ ప్రారంభం
2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనారిటీ ఫ్రీ మెట్రిక్( 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు) పోస్ట్ మెట్రిక్ (ఇంటర్ డిగ్రీ పీజీ వరకు గవర్నమెంట్ గుర్తింపు/ పొందిన ప్రైవేట్ కాలేజీలో మరియు ఐటిఐ/ ఐటిఐ టెక్నికల్ కోర్సులు) మెరిట్ కం మీన్స్ (లిస్టెడ్ కోర్సులు ఎట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు) చదువుతున్న మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫ్రెష్ మరియు రెన్యువల్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు ల స్వీకరణ ప్రారంభమైనది సంబంధిత విద్యార్థులు మరియు పాఠశాల/ కళాశాల వారు వెబ్ సైట్:- https://scholarships.gov.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం ప్రసాద్ రావు గారు ఓ ప్రకటనలో తెలిపారు
- ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకొనుటకు చివరి తేదీ 15.10.2022
2.పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకొనుటకు చివరి తేదీ 31.10.2022
3.మెరిట్ కం మీన్స్ అప్లై చేసుకొనుటకు చివరి తేదీ 31 10 2022
అదేవిధంగా పాఠశాల/ కళాశాల వారు వారి యొక్క ఇన్స్టిట్యూట్ లాగిన్ ద్వారా మొదటగా ప్రొఫైల్ మరియు తరగతులు వాటి ఫీజులు వివరాలు నమోదు అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే విద్యార్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి అప్లై చేసుకున్న విద్యార్థులు యొక్క దరఖాస్తులను పాఠశాల కళాశాల వారు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులను 31.10 .2022 లోపు పరిశీలించాలి పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ యొక్క దరఖాస్తులను పరిశీలించుటకు 15.11.2022 చివరి తేదీగా తెలియజేయడమైనది మిగతా వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం నందు సాంప్రదించగలరు మొబైల్ నెంబర్ 8099059007