స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
రోడ్డు ప్రమాదాల నివరణకు చర్యలు తీసుకోవాలి.
ప్రజలకు సమార్దవంతమైన సేవలు అందిచాలి.
నెలవారి నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు.కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు.ఫోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు.దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు సమర్దవంతమైన సేవలు అంధించాలని అన్నారు.ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు.విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.అధెవిదంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్ మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.
జిల్లా పోలీసు అధికారులకు సిసి కెమెరాల పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.రద్దీ గల ప్రదేశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వలన నేరలను చేధించడంలో సిసి కెమెరాలు ఉపయోగపడుతాయని గతం లో చాలా కేసులు సిసి కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించడం జరిగిందని అన్నారు.కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారిరక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన సత్వర సేవలు అందించాన్నారు.సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో తూప్రాన్ డిఎస్పీ.వెంకట్ రెడ్డి మెదక్ డిఎస్పీ. ప్రసన్న కుమార్ సైబర్ క్రైమ్ డిఎస్పీ.సుభాష్ చంద్ర బోస్ ఎఆర్ డిఎస్పీ.రంగా నాయక్ మెదక్ టౌన్ సిఐ.నాగరాజు మరియు మెదక్ రూరల్ సిఐ. రాజశేఖర్ రెడ్డి అల్లాదుర్గ్ సిఐ.రేణుక రెడ్డి తూప్రాన్ సిఐ.రంగాకృష్ణ ఎస్బీ.ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్ మధు సుధన్ గౌడ్ మరియు ఎసై లు పాల్గొన్నారు.
