స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: విద్యార్థులకు అందించే ఆహారం పట్ల రోజూ వారి మెనూని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం జిల్లాలోని టేక్మాల్ మండలంలో గల కేజీబీవీ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఎక్కడ నుంచి వచ్చారు? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనాన్ని సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో వృద్ధిలోకి రావాలని మార్గనిర్దేశం చేశారు.అలాగే ప్రతిరోజూ సరుకుల నాణ్యతను నిశితంగా పరిశీలించాలని పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని సమయానుగుణంగా రుచికరమైన పోషకాహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ఉపాధ్యాయులు సిబ్బంది హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేసి సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థినిల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.