బెట్టింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవుజిల్లా ఎస్పీ.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్

స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:జిల్లాలో ఎవరైన క్రికెట్‌ మరే ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ హెచ్చరించారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది సాధించడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్‌ మీడియా సైతం యువతకు మరింత చేరువ అయింది. తద్వారా మోసగాళ్ళ మోసపూరితమైన ప్రకటనలు సందేశాలకు యువత ఆకర్షితులై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ పాటు ఇతరత్రా బెట్టింగ్‌ల వైపు యువత తొంగిచూడమే కాకుండా ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్బాల్లో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.ఈ బెట్టింగ్‌ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందని. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఐపియల్ సిజన్‌ ప్రారంభం అయింది.ఇది దృష్టిలో వుంచుకోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలని ముఖ్యంగా వారు క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రసారం అయ్యే సమయాల్లో వారి ప్రవర్తతో పాటు వారు సెల్‌ఫోన్లలో మాట్లాడే సంభాషణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. జిల్లా పరిధిలో బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు గాను పెద్దఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని ఇందుకోసం ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇతర ప్రత్యేక బృందాలను వినియోగించుకొవడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో ఎవరైన బెట్టింగ్‌లను పాల్పడిన పోత్సహించిన వారి పట్లకఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా డయల్‌ 100కు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!