స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం.పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు.శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి నిరుపేదకు కడుపునిండా నాణ్యమైన సన్న బియ్యం బువ్వను అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారుఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ సన్న బియ్యాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి తాసిల్దార్ సంబంధిత ప్రజా ప్రతినిధులురెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
