జాతీయ రోడ్డు భద్రత మాసో త్సవాలలో భాగంగా ఈరోజు తేదీ 07.01.2025 రోజున చేవెళ్ల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశం గారు మరియు చేవెళ్ల L&O ఇన్స్పెక్టర్ శ్రీ భూపాల్ శ్రీధర్ గారి నేతృత్వంలో రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల ముఖ్య విధులైన రోడ్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ లలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పాదాచారులు రోడ్డు దాటినప్పుడు జీబ్రా క్రాసింగ్ లైన్ వద్దనే రోడ్డు దాటవలెనని, సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటకూడదని సూచించారు, మైనర్ లు వాహనాలు నడపకూడదని వారికి వాహనాలు ఇచ్చిన వారితోపాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారు నడిపేటపుడు సీటు బెల్టు పెట్టుకొని వేగ నియంత్రణ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు, ప్రతి ఒక్కరు తమ వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో పాటు లైసెన్స్ ఉంటేనే వాహనాన్ని బయటకి తీయాలని లేనియెడల ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఇన్సూరెన్స్ వర్తించదని అన్నారు, ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి వాటి వల్ల కలిగి అనర్ధాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటిని నివారించాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలను నడపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిన్నపురెడ్డి, ట్రాఫిక్ ఏఎస్ఐ అశోక్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!