విశాఖపట్నం :
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.ఇప్పటికే ప్రధాని మోడీ సభాప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.
బయట నుండి వచ్చే వ్యక్తు లపై నిఘా ఉంచనున్నారు పోలీసులు. ఇక,నేడు,రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగ ణంలో 5000 మంది పోలీ సులు చేరుకుంటున్నారు.
35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ప్రధాని మోడీకి స్వాగతం పలికి ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనున్నారు.