కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పాత్రికేయుడు కృష్ణపల్లిసురేష్ కి మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రజా సంఘాల నాయకులు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ పాత్రికేయుడికి ఆధిపత్య, ప్రతిఘటన సామాజిక సాంస్కృతిక మాసపత్రిక, ఆచరణవాది కా.టి. ఎన్. వెంకట రమణ. అను రెండు పుస్తకాలను పాత్రికేయడికి అందజేశారు.అనేకమంది కామ్రేడ్స్ సందేశాల ద్వారా వెల్లడించారని, ప్రజా ఉద్యమ శ్రేయోభిలాషులంతా చదవాల్సిన పుస్తకం అన్నారు. సంపాదకీయం, స్వసంత్ర భారతం ఎదుర్కొంటున్న,చర్మకారుల వృత్తిని, వర్గీకరణ సమస్య, సామాజిక న్యాయం కోసం, ఊహించని విషాదం, ఎత్తిన జెండా దించని వాడు, గొప్ప ఆర్గనైజర్, గొప్ప వ్యక్తి.అంశాలపై ఉన్నాయని పుస్తకాలు చదవడం అనేది సమాజంలో ఉన్నత శిఖరాలను అనుకున్న లక్ష్యాన్ని చేరడమే నని తెలిపారు. సొసైటీలో జర్నలిస్టుల సమస్యల,హక్కుల జర్నలిస్టుల జీవనాధార వృత్తి పాత్ర వివరిస్తూ మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని జర్నలిస్టుల పాత్ర కీలకంగా ముద్రపడి వుందని, జర్నలిస్టులు సామాజిక సేవలో చావు వచ్చే వరకు 24 గంటలు నిమగ్నమై ఉంటారని వెల్లడించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమంటూ చెప్పుకొచ్చారు.జర్నలిస్టుల ఏలాంటి సమస్యలు ఐనప్పటకి పరిష్కరించేందుకు ప్రభుత్వం,జిల్లా అధికారుల యంత్రాంగం పటిష్టంగా క్రమ బద్దంగా తప్పకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.