హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో ఏసీబీ దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది.