సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.