చెన్నైలోని ఓ హాస్పిటల్లో సినీ నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అయన డిశ్చార్జ్ అయ్యారని.. ఇంట్లో కోలుకుంటున్నారని ఆయన పి ఆర్ ఓ వెల్లడించారు. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరగా, మెదడులోని ఓ ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో కలిపి దాదాపు 220 సినిమాల్లో ప్రభు నటించారు.