చైనాలో గుర్తించిన కొత్త వైరస్
హెచ్ఎంపీవి (HMPV) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. ఈ వైరస్ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. వైరస్ సోకిన 3 నుంచి 10 రోజుల్లోగా దగ్గు, ముక్కు దిబ్బెడ, గొంతు నొప్పి, శ్వాస సంబంధ సమస్యలు కనిపిస్తాయన్నారు. వైరస్ సోకిన చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!