స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
అభివృద్ధి సంక్షేమలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు సమిష్టిగా పని చేయాలి.2025 ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు వెల్లివిరియాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అడిషనల్ ఎస్పీ మహేందర్ డిఆర్ఓ భుజంగరావు జడ్పీ సీఈఓ ఎల్లయ్య డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు డిపిఓ యాదయ్య ఆర్డీవోలు నర్సాపూర్ మహిపాల్ రెడ్డితూప్రాన్ జయచంద్రారెడ్డి సంబంధిత కలెక్టరేట్ సూపర్డెంట్ సంబంధిత జిల్లా అధికారులు టిజి ఓస్ టీఎన్జీవోస్ నాయకులు కలెక్టరేట్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది కలెక్టర్ ను కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు.సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.పూల బొకేలకు బదులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందించి పేద విద్యార్థులకు చేదోడు వాదోడుగా నిలవాలనే కాంక్ష అభినంద నీయమన్నారు. నోట్ పుస్తకాలు పెన్నులు అందించిన అధికారులు అభినందించారు..త్వరలోనే వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.