మొయినాబాద్ పరిధి చిలుకూరు లో గురువారం దారుణం జరిగింది. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.