ప్రతినిధులు అందరు కూడా బొకేస్ స్వీట్స్ డ్రైఫ్రూట్స్ బాక్సెస్ బదులుగా బుక్స్ మరియు పెన్స్ తేవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విజ్ఞప్తి చేశారు.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
మెదక్ జిల్లా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చే జిల్లా అధికారులు మండల అధికారులు వాళ్ళ స్టాప్ మరియు వివిధ సంస్థల ప్రతినిధులు అందరు కూడా బొకేస్ స్వీట్స్ డ్రైఫ్రూట్స్ బాక్సెస్ బదులుగా బుక్స్ మరియు పెన్స్ తేవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అలా వచ్చిన బుక్స్ మరియు పెన్స్ లను అవసరం ఉన్న ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రతి ప్రభుత్వ అధికారి నిజాయితీగా నిస్వార్ధంగా కృషిచేసి ప్రజల మన్ననలు పొంది పారదర్శకమైన ప్రజాపాలనను అందించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు.