స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

9 మంది అనుభవిజ్ఞులైన వైద్యాధికారులతో ఉచిత వైద్య పరీక్షలు.

ఈనెల 20 శుక్రవారం మెదక్ జిల్లా వైద్యశాలలో దివ్యాంగులకు వైద్య శిబిరం నిర్వహణ. డి.ఆర్.డి.ఓ డి.డబ్ల్యు.ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరం ఏర్పాటు.మెదక్ జిల్లాలో దివ్యాంగులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
దివ్యాంగుల కొరకు ఈనెల 20వ తారీకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి దివ్యాంగుల వైద్య శిబిరం ఏర్పాటుపై
ఆయన మాట్లాడుతూ గత దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో దివ్యాంగులకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డి.ఆర్.డి.ఓ
డిడబ్ల్యుఓ అధికారుల సమన్వయంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగుల ఆరోగ్య పరిరక్షణపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఈనెల 20 శుక్రవారం ఉచిత వైద్య శిబిరంలో ఈశ్వర్ దాస్ (జనరల్ సర్జన్)సురేందర్ (ఆర్థోపెడిక్) పావని( స్త్రీవైద్యనిపుణులు)డి.కిరణ్ (ఈ ఎన్ టి)డాక్టర్ రాజేష్ (ఆప్తమాలజిస్ట్)డాక్టర్ గ్రేస్ (ఫిజియోథెరపిస్ట్)డాక్టర్ ప్రదీప్ (మానసిక వైద్య నిపుణులు) మాధవి (డెంటల్ సర్జన్) డాక్టర్ కరుణాకర్ (ఫిజియోథెరపిస్ట్ ఊపిరితిత్తులు శ్వాసకోస వ్యాధి నిపుణులు) నిష్ణాతులైన వైద్యులచే దివ్యాంగులకు చికిత్సలు అందించడం జరుగుతుంది అన్నారు
ఈ సదవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!