విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పరిశీలన.విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పరిధిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ విద్యార్థుల మెనూ డైనింగ్ హాల్ డార్మెంటరీ స్టోర్ రూమ్ సంబంధిత వాటిని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని విద్యార్థులు కలిగించి ఉత్తమ విద్యా బోధన అందించాలని నూతన మెనూ సక్రమంగా అమలు చేయాలని మెనూ తయారు చేసే విధానంలో నైపుణ్యత సంపాదించుకునేలా వంట మాస్టర్లకు అవగాహన అవసరమని చెప్పారు.వంట వండడం వడ్డించడం అనే విధానాలు మార్పులు కనపడాలన్నారు మెనూ అమలపరిచే విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు విద్యార్థినిలు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.