స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
ఈ నెల 25 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన మెదక్ చర్చ్ సందర్శన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనం సందర్భంగా శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మెదక్ చర్చి సందర్శన ఏడుపాయల అమ్మవారి దర్శించుకోనున్నట్లు తెలిపారు. ప్రాంగణంలో ముఖ్య మంత్రివర్యులు అమ్మవారిని దర్శించుకునే ప్రాంతం పార్కింగ్ ప్రదేశాలు ఎలి ప్యాడ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లపై తగు సూచనలు సలహాలు అందించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.